VIDEO: మేడారం గద్దెల వద్ద భక్తుల భారీ సందడి
MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద నేడు భక్తుల సందడి కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో గద్దెల ప్రాంగణం వనదేవతల నామస్మరణతో మారుమోగుతోంది.పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకోగా, నేడు ఉదయం జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు. జాతర ఏర్పాట్లను కలెక్టర్ దివాకర పర్యవేక్షిస్తున్నారు.