మంధానకు కాబోయే భర్తకు ఏమైందంటే..?

మంధానకు కాబోయే భర్తకు ఏమైందంటే..?

భారత మహిళా స్టార్ క్రికెటర్‌ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆమె వివాహం వాయిదా పడింది. అయితే, మంధానకు కాబోయే భర్త పలాశ్‌ ముచ్చల్ సైతం ఛాతీలో ఇబ్బంది, శ్వాస తీసుకోవడంలో సమస్యతో అతడు ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు.. ఒత్తిడి, యాంగ్జైటీ వల్ల ఇలా జరిగిందని తేల్చారు. మూడు వారాలు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు.