రంగనాయుడుపల్లిలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ

NLR: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బరువులను పోషణ్ ట్రాకర్ యాప్‌తో పాటు, రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ షేక్ షాను అన్నారు. ఆమె మంగళవారం రంగనాయుడుపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది కేంద్రాల నిర్వహణలో సమయపాలన పాటిస్తూ, పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయాలన్నారు.