'BRS నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితం'
MNCL: BRS మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ సుదర్శన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్యపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అర్ధరహితమని కాంగ్రెస్ నాయకులు ఖాజా పాషా అన్నారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక MLA వినోద్‌పై, పట్టణ అధ్యక్షులు మల్లయ్యపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.