వైభవంగా శ్రీకృష్ణ తులసి కళ్యాణం
SRCL: శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి మండపంలో ఆదివారం రాత్రి శ్రీ కృష్ణ తులసి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో కార్తీక శుద్ధ ద్వాదశి సందర్భంగా శ్రీ రుక్మిణి విఠలేశ్వర స్వామి వారికి పంచపనిషత్తూ ద్వారా అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.