‘విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోండి'

‘విద్యుత్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోండి'

HYD: చందానగర్ హుడా కాలనీ లక్ష్మీ గణపతి టెంపుల్ ప్రాంతంలో సైబర్ సిటీ విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్ బుధవారం పర్యటించారు. సెక్షన్ పరిధిలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ లైన్ కేబుల్ మార్పును పరిశీలించి పలు సూచనలు చేశారు. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.