బొల్లవరం మున్సిపల్ ప్లాట్లను పరిశీలించిన జేసీ

బొల్లవరం మున్సిపల్ ప్లాట్లను పరిశీలించిన జేసీ

KDP: ప్రొద్దుటూరులోని బొల్లవరం మున్సిపల్ ప్లాట్లను మంగళవారం జేసీ నిధిమీనా పరిశీలించారు. మున్సిపాలిటీకి 83 ఎకరాల్లో 760 ప్లాట్లు ఉన్నాయి. గతంలో 244 ప్లాట్లు విక్రయించారు. మిగతా 516 ప్లాట్ల విక్రయానికి మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలను జేసీ వద్ద ఉంచారు. వీటి విక్రయం ద్వారా రూ.250-300 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు.