పేకాట శిబిరంపై దాడి.. 9 మంది అరెస్ట్

పేకాట శిబిరంపై దాడి.. 9 మంది అరెస్ట్

నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో శనివారం ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్, కోస్గి పోలీసులు సంయుక్తంగా పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 1.89 లక్షల నగదు, 52 పేకాట ముక్కలు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ బాలరాజు హెచ్చరించారు.