టీఎంసీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయింది: మోదీ

టీఎంసీ అవినీతిలో పూర్తిగా కూరుకుపోయింది: మోదీ

టీఎంసీ ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రజల సొమ్మును టీఎంసీ నేతలు విచ్ఛలవిడిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. చేసిన అక్రమాలకు టీఎంసీ నేతలు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరుల నుంచి దొంగిలించిన డబ్బును తిరిగి తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేరస్తులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు.