VIDEO: అన్నారం బ్యారేజ్‌కు తగ్గిన వరద ఉద్ధృతి

VIDEO: అన్నారం బ్యారేజ్‌కు తగ్గిన వరద ఉద్ధృతి

BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం సరస్వతి బ్యారేజీలోకి వరద ప్రవాహం మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పట్టింది. నీటిపారుదల శాఖ అధికారుల ప్రకారం, ఉదయం 19,595 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. అదే సమయంలో, సుందిళ్ల పార్వతి బ్యారేజ్ నుండి 19,775 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజీ నుండి 42,088 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతున్నట్లు తెలిపారు.