బీజేపీ ఉంటేనే అభివృద్ధి సాధ్యం..

ADB: ఇంద్రవెల్లి మండలంలోని సీత్తబట్ట, దుబ్బగూడ, కొబ్బరిగూడ, దాన్నోర(కే), పిప్రి, లక్కుగూడ తదితర గ్రామాల్లో ఆదివారం బీజేపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో గత పదేళ్లలో దేశం గణనీయ అభివృద్ధి సాధించిందన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే మరోసారి బీజేపీ రావాలన్నారు.