వికలాంగుల ధర్నా... స్పందించిన కలెక్టర్

వికలాంగుల ధర్నా... స్పందించిన కలెక్టర్

ATP: అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద వికలాంగుల పింఛన్లు తొలగింపుకు వ్యతిరేకంగా బాధితులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారిని కలెక్టర్ వినోద్ కుమార్ కలిసి, పింఛన్ల సమస్యను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. దీంతో వారు ధర్నా విరమించారు.