మండల కేంద్రంలో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు
ASF: లింగాపూర్ మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాధవ్ లోకేందర్ మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్రం అనిల్ కుమార్, మాణిక్ రావు, తదితరులు పాల్గొన్నారు.