మార్చి 28 లోగా ఆ నిధులు ఖర్చు చేయాలి

మెదక్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలకు ప్రభుత్వం విడుదల చేసిన నిధులన్నీ మార్చి 28వ తేదీ లోపల డ్రా చేసి ఖర్చు చేయాలని లేనిచో నిధులన్నీ వెనక్కి వెళ్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. అదేవిధంగా దీనికి సంబందించిన యూసీలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.