బైరవానితిప్ప ప్రాజెక్టుకు పెరిగిన ఇన్ ఫ్లో
ATP: బైరవానితిప్ప ప్రాజెక్టుకు వరదనీరు కొనసాగుతోంది. కర్ణాటకలోని వాణివిలాస్ డ్యాం నుంచి వేదావతి హగరి మీదుగా డ్యాంలోని 462 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో అవుతోందని జలవనరులశాఖ ఏఈఈ హరీష్ తెలిపారు. రెండు రోజుల క్రితం 280 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. 462 క్యూసెక్కుల నీటిని హగరికి, సాగునీటి కాలువల ద్వారా చెరువులకు వదిలినట్లు తెలిపారు.