చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్‌కు బై బై
ASR: చింతపల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్ కు ఏకలవ్య మోడల్ పాఠశాల విద్యార్థులు బై బై చెప్పారు. కొయ్యూరు మండలం బాలారంకు ఏకలవ్య పాఠశాల మంజూరయింది. అయితే అక్కడ భవనాలు లేక మూడేళ్ల నుంచి చింతపల్లి వైటీసీలో తరగతులు నిర్వహించారు. బాలారంలో భవన నిర్మాణాలు పూర్తయి పాఠశాల ప్రారంభించారు. బస్సులు ఏర్పాటు చేసి చింతపల్లి వైటీసీ నుంచి విద్యార్థులను శనివారం బాలారం తరలించారు.