క్రీడలు అంటే కేవలం పోటీలు కాదు: జేసీ

క్రీడలు అంటే కేవలం పోటీలు కాదు: జేసీ

కోనసీమ: క్రీడలు అంటే కేవలం పోటీలు మాత్రమే కాదని అవి ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రతీకలని జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. అమలాపురంలోని బాలయోగి స్టేడియం వద్ద కోనసీమ హెల్త్ వారియర్స్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన బ్యాడ్మింటన్ పోటీలలో గెలుపొందిన విజేతలను అభినందించారు. వారికి బహుమతులను, జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు.