అంబటి సవాల్ విసరడం సిగ్గు చేటు: నిమ్మల

AP: పోలవరంపై చర్చకు సిద్ధమా అని మాజీమంత్రి అంబటి రాంబాబు సవాలు విసరడం సిగ్గుచేటని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అబద్దాలు అతికినట్లు చెప్పడంలో ఆయనకు ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. పోలవరాన్ని పూర్తి చేయకుండా మాజీమంత్రి చేతులెత్తేశారని తెలిపారు. ఇరిగేషన్ మంత్రిగా చేసిన అంబటికి పోలవరం గురించి అర్థం కాలేదని.. టీడీపీ దిగువశ్రేణి నేతలకు ఉన్న అవగాహన కూడా ఆయనకు లేదని చెప్పారు.