'రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దు'

WNP: రైతులను అనవసరంగా కార్యాలయాల చుట్టూ తిప్పుకొని ఇబ్బందులకు గురి చేయవద్దని జిల్లా అదనపు కలెక్టర్ కీమ్య నాయక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం చిన్నంబావి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. భూ భారతి దరఖాస్తులు, సాదా బైనామా పెండింగ్ మ్యూటేషన్, సక్షేషన్, పెండింగ్‌లో ఉన్న తదితర పనులన్నీ వెంటనే పరిష్కరించాలని ఆయన సూచించారు.