ఆటో డ్రైవర్ల ధర్నాను జయప్రదం చేయాలి: CITU

VZM: రవాణా రంగంలో ఆటో డ్రైవర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని CITU విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ అన్నారు. ఆటో డ్రైవర్ సమస్యలపై ఆగస్టు11న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. శుక్రవారం తోటపాలెం ముత్యాలమ్మ గుడి దగ్గరి ఆటో స్టాండ్ డ్రైవర్లు ఆయన సమక్షంలో CITUలో చేరారు.