ఐరాల తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే
CTR: ఐరాల మండలం తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ లోకేశ్వరి లబ్ధిదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన మరికొన్ని అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.