'ఆన్‌లైన్ మోసాలపై అవగాహన'

'ఆన్‌లైన్ మోసాలపై అవగాహన'

కృష్ణా: ఆన్‌లైన్ మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సీఐ లక్ష్మీ నారాయణ అన్నారు. మహిళ సాధికారత వారోత్సవాల నిర్వహణ సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అదే విధంగా ఆన్‌లైన్ మోసాల గురించి విద్యార్థులకు వివరించినట్లు సీఐ నారాయణ తెలిపారు.