'ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం'

SRCL: గ్రామాల్లో పరిశుభ్రత నెలకొల్పడానికి రేయింబవళ్ళు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని డీఆర్డీఓ శేషాద్రి పేర్కొన్నారు. యూనిసెఫ్- స్వచభారత్ సమన్వయంతో పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రత, గౌరవం అనే అంశంపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లాలోని ఆయా మండలాల ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ నిర్వహించారు.