నూజివీడులో సర్దార్ గౌతులచ్చన్న వర్ధంతి
ఏలూరు: నూజివీడు పట్టణంలో సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. పలువురు నేతలు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధునిగా, బహుజనుల పురోభివృద్ధి, విద్యాభివృద్ధి కోసం సర్దార్ గౌతులచ్చన్న చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు.