ఈ నెల 13 నుంచి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

SKLM: జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13,14వ తేదీల్లో జరుగునున్న నారాయణ శెట్టి వాసు మెమోరియల్ ఛాంపియన్‌షిప్ జిల్లా స్థాయి బ్యాట్మెంటన్ పోటీలు బ్రోచర్‌ను సంఘం జిల్లా అధ్యక్షుడు కిల్లంశెట్టి సాగర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అండర్ 11, 12, 15, 17, 19, సీనియర్ విభాగాల్లో బాలబాలికలు పోటీలు నిర్వహించి జిల్లా జట్టును ఎంపిక చేస్తామని, ఆసక్తిగల క్రీడాకారులు పాల్గొనాలని పేర్కొన్నారు.