VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
VSP: మద్దిలపాలెం జంక్షన్ వద్ద నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం రక్తసిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.