మత్తు టాబ్లెట్ల ఘటనపై స్పందించిన DSP

మత్తు టాబ్లెట్ల ఘటనపై స్పందించిన DSP

గుంటూరు వినోబా నగర్‌ మత్తు బిళ్ళల కలకలంపై ఈస్ట్ DSP అజీజ్ స్పందించారు. శుక్రవారం స్వాధీనం చేసుకున్న టాబ్లెట్లను డ్రగ్ కంట్రోలర్‌కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. నిషేధిత మత్తు మందులుగా తేలితే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్న అపోహలను ప్రజలు నమ్మవద్దని ఆయన సూచించారు.