'ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి'
CTR: అంబేద్కర్ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని గంగవరం మండలం దళిత సంఘం నాయకులు కోరారు. తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం వారు నిరసన వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయం ముందు భవన నిర్మాణానికి 10 సెంట్ల స్థలాన్ని గతంలో కేటాయించిందన్నారు. దానిని ఆలయ నిర్మాణం పేరుతో ఆక్రమించుకున్నారని వారు ఆరోపించారు.