VIDEO: ‘చేనేతలకు ఉచిత విద్యుత్ నేటి నుంచి అమలు’
KDP: ఎన్నికల హామీ మేరకు చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం నేటి నుంచి అమలు చేస్తున్నట్లు జిల్లా TDP అధ్యక్షుడు భూపేశ్ రెడ్డి తెలిపారు. జమ్మలడుగులో NTR భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఆయన మాట్లాడారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత కరెంటు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం వల్ల చేనేతలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు.