కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

తెలంగాణ భవన్‌లో కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. లేబర్ కోడ్‌లతో కార్మికులకు కలిగే నష్టాలపై బీఆర్‌ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మాజీమంత్రి కేటీఆర్, పలు కార్మిక సంఘాల నేతలు హాజరుకానున్నారు. కాగా, ఇటీవల కేంద్రం కొత్త లేబర్ కోడ్‌లను అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.