'సమస్యల పరిష్కార వేదికకు 114 వినతులు'

SKLM: సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పలు ప్రాంతాల అర్జీదారుల నుంచి 114 వినతులు వచ్చాయని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈఓ ఎల్ఎన్‌వి. శ్రీధర్ రాజా చెప్పారు. వీటిని స్వీకరించిన RDO వెంకటేశ్వరరావు తక్షణమే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.