టెహ్రాన్‌లో విద్యుత్తుకు అంతరాయం
ఇజ్రాయెల్ దాడుల కారణంగా టెహ్రాన్ ఉత్తర ప్రాంతంలో పాక్షికంగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. బుషెహర్ అణు విద్యుత్తు కేంద్రంపై దాడి జరిగింది. టెహ్రాన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీపైనా దాడి జరిగింది. ఈ దాడిలో పరిశోధన, విద్యా భవనాలు దెబ్బతిన్నాయి.