'గురుకులాల్లో త్వరలో మీడియా సెంటర్లు ఏర్పాటు'
SRPT: గురుకుల పాఠశాల, కళాశాలలో త్వరలో మీడియా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు గురుకుల సొసైటీ జోనల్ ఆఫీసర్ అరుణకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నడిగూడెం మండల కేంద్రంలోని స్థానిక గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు. మారుమూల గ్రామ ప్రజలకు విద్యాభివృద్ధి కార్యక్రమాలను తెలియజేయడమే ఈ సెంటర్ ముఖ్య ఉద్దేశమని ఆమె తెలిపారు.