మహా శివరాత్రి ప్రత్యేక పూజలతో ఘనోత్సవం
PDPL: మహా శివరాత్రి సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని శివాలయాలు శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంలో మారుమోగాయి. ఆదివారం తెల్లవారుజామున ప్రత్యేక విశేష పూజలు నిర్వహించగా, గోదావరి నదిలో వేలాది మంది భక్తులు పుణ్యస్నానాలు చేసారు. జనగామ శ్రీ త్రిలింగ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు శివలింగాలకు విశేష పూజలు చేశారు.