వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై సోదరుడు క్లారిటీ

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై సోదరుడు క్లారిటీ

టీమ్ఇండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం గురించి ఆయన సోదరుడు వీరేంద్ర కాంబ్లీ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. వినోద్ కాంబ్లీ ప్రస్తుతం అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. అయితే, ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నారని వీరేంద్ర కాంబ్లీ పేర్కొన్నారు. అయినప్పటికీ, కాంబ్లీకి మాట్లాడటంలో ఇంకా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.