కొండ మీద'పులి'.. గ్రామాల్లో టెన్సన్..!
E.G: పెదకొండేపూడి,నేలకోట గ్రామాల సరిహద్దు కొండల్లో 4రోజులుగా పులి తిష్టవేసింది. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పులి 400 మీటర్ల ఎత్తులో కొండ మీద ఉన్నట్లు ట్రాకింగ్‌లో తేలిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో గిరిజనులు అటువైపు వెళ్లొద్దని అధికారలు హెచ్చరికలు జారీ చేశారు. పులి ఎప్పుడు వస్తుందోనని ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.