బదిలీపై వెళ్తున్న ఎస్సైకి ఘన సన్మానం
KMR: గత 15 నెలలుగా మద్నూర్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ నిజాయితీ నిబద్ధతతో ప్రతి ఒక్కరి మన్ననలు పొందిన మద్నూర్ ఎస్సై విజయ్ కొండ బదిలీపై బీబీపేట్‌కి వెళ్తున్నారు. మంగళవారం పెద్ద ఎక్లరా నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆయనను కలిశారు. ఈ క్రమంలో ఎస్సైని సన్మానించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పటేల్, ప్రదీప్ పటేల్, ప్రహలాద్ పటేల్, గణేష్ దేశాయ్ పాల్గొన్నారు.