చిరుత పులి సంచారం.. భయాందోళనతో ప్రజలు
కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. మాచారెడ్డి మండలం చుక్కానర్ దోమకొండ అంబారీపేటలో లెగదూడలపై చిరుత దాడి చేసింది. చిరుత దాడి చేయడంతో ఆ గ్రామంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. చిరుత పులి సంచారం చేయడంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు చిరుత పులి సంచారాన్ని గుర్తించారు.