'యువత స్వయంకృషితో ముందుకు వెళ్లాలి'
SRCL: యువత స్వయం కృషితో ముందుకు వెళ్లాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో విజయ పాల డైరీని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలోని యువతి, యువకులు స్వయం ఉపాధితో ముందుకు వెళ్లాలని సూచించారు. ఆయన వెంట నిర్వాకులు లింగాల లింగయ్య, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.