ఎలక్షన్ ఏజెంట్లకు గోరంట్ల దిశానిర్దేశం

ఎలక్షన్ ఏజెంట్లకు గోరంట్ల దిశానిర్దేశం

E.G: రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలింగ్ ప్రక్రియ చాలా కీలకమని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. బుధవారం రాజమండ్రిలో గోరంట్ల రవికిరణ్ కార్యాలయంలో పోలింగ్ బూత్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. బ్యాలెట్‌తో జరిగే ఎన్నికలపై ఓటర్‌కు పూర్తి అవగాహన కల్పించాలని, ఏ ఒక్క ఓటు ఇన్ వ్యాలీడ్ కాకుండా చూడాలని ఏజెంట్లకు దిశా నిర్దేశం చేశారు.