గంగవరం పోర్టులో కొత్త డెప్త్ రికార్డు

VSP: విశాఖ అదానీ గంగవరం పోర్టు లిమిటెడ్ కొత్త లోతు రికార్డును నెలకొల్పింది. వేదాంత లిమిటెడ్ కోసం 1,77,121 మెట్రిక్ టన్నుల బాక్సైట్‌ను తీసుకువచ్చిన ఒక నౌకను 18.2 మీటర్ల డ్రాఫ్ట్‌తో విజయవంతంగా నిలిపింది. ఇది గతంలో ఉన్న 18.12 మీటర్ల రికార్డును అధిగమించిందని పోర్టు అధికారులు మంగళవారం తెలిపారు.