తణుకు సబ్ జైలు సందర్శించిన న్యాయమూర్తి
W.G: జిల్లాల న్యాయ సేవల సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి కె. రత్నప్రసాద్ ఇవాళ తణుకు సబ్ జైలును సందర్శించి రిమాండులో ఉన్న ముద్దాయిలను పరామర్శించారు. వారికి అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.