'ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ అవసరం'
ADB: ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే కృషి, క్రమశిక్షణ, పట్టుదల అవసరమని ఉట్నూర్ ITDA PO యువరాజ్ మర్మాట్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. గురువారం ఉట్నూర్‌లో నిర్వహించిన “ఇగ్నిట్ యువర్ డ్రీమ్స్”మోటివేషన్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కఠిన శ్రమతో ముందుకు సాగాలని సూచించారు.