గాల్లోనే విమానం.. డోర్ తెరిచేందుకు యత్నం
ఇండిగో విమాన ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని మందలించడంతో తన సీటు వద్దకు వెళ్లాడు. ల్యాండింగ్ సమయంలోనూ మరోసారి అలాగే చేయడంతో పైలట్ విమానాన్ని గాల్లోనే తిప్పి తర్వాత సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం నిందితుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.