అక్రమ ఇసుక రవాణాపై కేసు నమోదు

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన జుల సాయి గురువారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ దొరికిపోయాడు. గ్రామంలో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ఎస్సై శేఖర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.