'రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేస్తాం'

'రైతులకు అవసరమైన ఎరువులు సరఫరా చేస్తాం'

AKP: రైతులకు అవసరమైన ఎరువులను సరఫరా చేసే బాధ్యత తనదని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. శుక్రవారం సబ్బవరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎరువులు దొరకవనే ఆందోళనతో రైతులు ఎగబడటంతో సమస్య వచ్చిందన్నారు. వాస్తవానికి ఎరువుల కొరత లేదన్నారు. వర్షాలు పడుతున్న నేపాధ్యంలో ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు.