ప్రమాదకరంగా మూలమలుపు.. ఆదమరిస్తే అంతే సంగతి!

ప్రమాదకరంగా మూలమలుపు.. ఆదమరిస్తే అంతే సంగతి!

SDPT: అక్కన్నపేట(M) చౌటపల్లి క్రాస్ వద్ద మొంథా తుఫాన్ వర్షాలకు తారు రోడ్డు కొట్టుకుపోయి ప్రమాదకర గుంత ఏర్పడింది. హుస్నాబాద్-జనగాం మధ్య రోజూ వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. రాత్రి వేళలో చౌటపల్లికి వెళ్లే ప్రయాణికులు ప్రమాదకర మూలమలుపు వద్ద అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.