పసలదీవిలో ఉచిత పశువైద్య శిబిరం
KDP: నరసాపురం మండలం పసలదీవిలో గురువారం ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. నరసాపురం MLA బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశువైద్యులు గ్రామంలోని పశువులకు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. అనంతరం పశువులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.