'దేవాలయాలపై ఓ కన్నేయండి'
VZM: రేపు కార్తీక సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పలు దేవాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున దేవాలయాలపై ఒక కన్నేసి ఉంచాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. దేవాలయాల వద్ద తగు భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలని దేవస్థాన నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు.