దొరువుల పాలెంలో ఇళ్ల స్థలాల మంజూరుకు ఆమోదం

NLR: ముత్తుకూరు దొరువుల పాలెం గ్రామపంచాయతీ మిట్టపాలెం గ్రామంలోని దళిత కుటుంబాలకు డొంక పోరంబోకు స్థలంలో ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు పంచాయతీ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. స్థానిక సర్పంచ్ సునందమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, ఈపూరు బిట్ -1ఎ ఎల్‌పీ నెంబర్ 453లో ఉన్న పోరంబోకు స్థలాన్ని ఇళ్ల స్థలాల కింద కేటాయించేందుకు పంచాయతీ పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు.